రన్ మెషీన్ విరాట్ కోహ్లీ అంటేనే రికార్డులకు పెట్టింది పేరు. ఎన్నో అనితరసాధ్యమైన రికార్డులను ఇప్పటివరకూ కోహ్లీ బ్రేక్ చేశాడు.. లేదా క్రియేట్ చేశాడు. అయితే సోమవారం ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌లో విరాట్ మరో రికార్డును సాధించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ మరో 17 పరుగులు చేస్తే.. టి-20 క్రికెట్‌లో 13 వేల పరుగుల మైలురాయిని దాటిన ఐదో క్రికెటర్‌గా కోహ్లీ నిలుస్తాడు. కోహ్లీ ఇప్పటివరకూ టి-20ల్లో 385 ఇన్నింగ్స్‌లో 41.47 యావరేజ్‌తో 12983 పరుగులు చేశాడు. దీంతో ఈ రికార్డుకు కోహ్లీ మరో 17 పరుగుల దూరంలోనే ఉన్నాడు. ఈ జాబితాలో మొదటి స్థానంలో 14562 పరుగులతో క్రిస్ గేల్ ఉండగా.. ఆ తర్వాతి స్థానంలో అలెక్స్ హేల్స్(13610) ఉన్నాడు. ఇక షోయబ్ మాలిక్(13557), కీరన్ పొలార్డ్(13537) మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు.
ఇక ఈ ఐపిఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడిన మూడు మ్యాచుల్లో రెండింటిలో విజయం సాధించి మంచి ఫామ్‌లో ఉంది. ఈ మ్యాచ్‌లోనూ విజయాన్ని దక్కించుకోవాలని భావిస్తోంది. ఇక ముంబై ఇండియన్స్ జట్టు ఈ సీజన్‌లో కేవలం ఒక మ్యాచ్‌లోనే విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పేస్ సంచలనం జస్ప్రీత్ బుమ్రా జట్టుతో జతకడితే.. అది ముంబైకి కలిసోచ్చే అవకాశం ఉంది.