Thursday, December 26, 2024

వన్డేల్లో 50 శతకాల కోహ్లీ… అప్పుడేనా?

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: విరాట్ కోహ్లీ వన్డేల్లో మంచి ఫామ్‌లో ఉన్నాడు. గత నాలుగు వన్డే మ్యాచ్‌ల్లో మూడు సెంచరీలతో భీకరమైన ఫామ్‌లోకి వచ్చాడు. కోహ్లీ 266 ఇన్నింగ్స్‌లలో 46 సెంచరీలు చేసి రెండో స్థానంలో ఉన్నాడు. ఐపిఎల్ ముందే 50 సెంచరీలు బాదే అవకాశాలు ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సచిన్ 466 ఇన్నింగ్స్‌లో 49 సెంచరీలతో మొదటి స్థానంలో ఉన్నాడు. విరాట్ నాలుగు సెంచరీలు చేస్తే చాలు సచిన్ రికార్డును బ్రేక్ చేయడంతో పాటు 50 సెంచరీలు చేసిన రికార్డును తన ఖాతాలో వేసుకుంటాడు. ఇలాగానే ఫామ్ కొనసాగిస్తే నాలుగు సెంచరీలు చేయడానికి ఏడు ఇన్నింగ్స్‌లు సరిపోతుంది.

ఈ సంవత్సరం న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో వన్డే మ్యాచ్‌లు ఉండడంతో రికార్డు బ్రేక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోహ్లీకి కివీస్ పై మంచి రికార్డు ఉంది. న్యూజిలాండ్ తో 26 ఇన్నింగ్స్‌లు ఆడి 5 సెంచరీలతో పాటు 8 హాఫ్ సెంచరీలు చేశాడు. 94.64 స్ట్రైక్ రేటులో 1378 పరుగులు చేయడమే కాకుండా సగటు 59.91గా ఉంది. విరాట్ కోహ్లీకి టి20, వన్డేలు, టెస్టులలో కలిపి 74 సెంచరీలు చేశాడు. ఇదే ఫామ్ కొనసాగిస్తే 26 సెంచరీలు చేయడమే పెద్ద కష్టమేమీ కాదని సునీల్ గావస్కర్ తెలిపాడు. 50 మ్యాచ్‌ల్లోనే ఈ రికార్డు బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయని సన్నీ తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News