Monday, February 24, 2025

విరాట్ సెంచరీ… అనుష్క పోస్టు వైరల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఛాంపియన్ ట్రోఫీలో పాకిస్థాన్ పై భారత్ ఘన విజయం సాధించింది. విరాట్ కోహ్లీ సూపర్ శతకం కొట్టడంతో భారత్ ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. పాక్ పై విరాట్ సెంచరీతో ఆయన అభిమానులకు అవధులు లేకుండా పోయాయి. విరాట్ శతకంపై ఆయన సతీమణి నటి అనుష్క శర్మ ఇన్ స్టా స్టోరీస్ తో ఫొటో షేర్ చేసింది.

పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ ను ఇంట్లో నుంచి అనుష్క శర్మ తిలకించింది. టివిలో విరాట్ సెంచరీ చేసిన అనంతరం సంబరాలను ఫొటో తీసి షేర్ చేసింది. దానికి లవ్, హైఫ్ ఎమోజీలను జత చేసి ఆనందాన్ని వ్యక్తం చేసింది. శతకం చేసిన వెంటనే కోహ్లీ తన మెడలోని గొలుసుకున్న వెడ్డింగ్ రింగ్ ను ముద్దాడాడు. అనుష్కకు సందేశమిచ్చేలా కెమెరాకు విజయ సంకేతం చూపించాడు. దీనికి సంబంధించిన అనుష్క పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News