Sunday, January 19, 2025

కోహ్లి అరుదైన రికార్డు

- Advertisement -
- Advertisement -

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి తన కెరీర్‌లో మరో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో కోహ్లి ఈ రికార్డును సాధించాడు. టెస్టు క్రికెట్‌లో కోహ్లి 9 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. భారత్ తరఫున టెస్టుల్లో ఈ ఘనత సాధించిన నాలుగో బ్యాటర్‌గా కోహ్లి నిలిచాడు. ఇంతకుముందు సచిన్, రాహుల్ ద్రవిడ్, సునీల్ గవాస్కర్‌లు ఇలాంటి ఫీట్‌ను సాధించారు. కివీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లి ఈ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. కాగా, కోహ్లి 197 ఇన్నింగ్స్‌లలో టెస్టుల్లో 9వేల పరుగులను పూర్తి చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News