Saturday, March 1, 2025

కివీస్ తో మ్యాచ్… ఏడు రికార్డులు కోహ్లీ ఖాతాలో?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఛాంపియన్ ట్రోఫీలో పాక్ జట్టుపై విరాట్ కోహ్లీ సెంచరీతో చేయడంతో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో విరాట్ కోహ్లీ 51 సెంచరీలు పూర్తి చేసి రికార్డు సృష్టించాడు. గతంలో సచిన్ టెండూల్కర్ 49 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ పలు రికార్డు సృష్టించి రికార్డుల రారాజుగా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం విరాట్ ముందు ఏడు రికార్డులు ఉన్నాయి. న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో ఆ రికార్డులు బద్దలు కొట్టే అవకాశం ఉంది. ఛాంపియన్ ట్రోఫీలో టీమిండియా తరపున విరాట్ 15 ఇన్నింగ్స్‌లలో 651 పరుగులు చేశాడు. కానీ శిఖర్ ధావన్ పది ఇన్నింగ్స్‌లలో 701 పరుగులతో తొలి స్థానంలో ఉండగా రెండో స్థానంలో సౌరవ్ గంగూలీ (665) ఉన్నాడు. కోహ్లీ 51 పరుగులు చేస్తే చరిత్ర సృష్టిస్తాడు.

ఛాంపియన్ ట్రోఫీలో వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ 791 పరుగులతో తొలి స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్, సెమీ ఫైనల్‌ మ్యాచ్ లలో విరాట్ 142 పరుగులు చేస్తే మరో రికార్డును తన ఖాతాలో వేసుకోవచ్చు. వన్డేలలో న్యూజిలాండ్‌పై సచిన్ 42 ఇన్నింగ్స్‌లలో 1750 పరుగులు చేసి తొలి స్థానంలో ఉండగా విరాట్ 31 ఇన్నింగ్స్‌లలో 1645 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్‌పై ఆరు సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్లు విరాట్, వీరేంద్ర సెహ్వాగ్, రికీ పాంటింగ్‌లు ఉన్నారు. కివీస్‌పై ఒక్క సెంచరీ చేస్తే ఆ జట్టుపై అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు కొల్లగొడుతాడు. ఛాంపియన్ ట్రోఫీలో 6 హాఫ్ సెంచరీలతో శిఖర్ ధావన్, సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రావిడ్ తొలి స్థానంలో ఉన్నారు. వరల్డ్ కప్‌లో 23 అర్థ శతకాలతో విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ ఫస్ట్ పొజిషన్‌లో ఉన్నారు. ఛాంపియన్ ట్రోఫీ, వరల్డ్ కప్‌లో కలిసి 29 హాఫ్ సెంచరీలతో విరాట్ రికార్డులోకి కెక్కాడు.

విరాట్ కోహ్లీ తక్కువ ఇన్నింగ్స్(299) 14000 పరుగులు చేసి రికార్డు నెలకొల్పాడు. సచిన్ టెండూల్కర్ 463 ఇన్నింగ్స్‌లలో 18, 426 పరుగులు, కుమార్ సంగక్కర్ 404 ఇన్నింగ్స్‌లలో 14,234, విరాట్ కోహ్లీ 299 ఇన్నింగ్స్‌లలో 14085 పరుగులు చేశాడు. టీమిండియా తరుపున విరాట్ కోహ్లీ 158 క్యాచ్‌లు పట్టి తొలి స్థానంలో ఉండగా రెండో స్థానంలో అజాహరుద్దీన్ 156తో ఉన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా మహేల జయవర్థన్ 218 క్యాచ్‌లతో తొలి స్థానంలో వరసగా రికీ పాంటింగ్(160), విరాట్ కోహ్లీ(158)లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News