వన్డే సిరీస్‌కు కోహ్లి దూరం?
ముంబై: క్లిష్టమైన దక్షిణాఫ్రికా పర్యటనకు ముం దు టీమిండియాలో విభేదాలు తలెత్తడం ఇటు బి సిసిఐకి అటు అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది. వన్డే సిరీస్ కోసం రోహిత్ శర్మను కెప్టెన్‌గా నియమించడంతో విరాట్ కోహ్లి తీవ్ర అసంతృప్తితో ఉన్నాడని జాతీయ మీడియాలో కథనాలు వె ల్లువెత్తాయి. అంతేగాక వన్డే సిరీస్‌కు కోహ్లి దూరమవుతున్నట్టు వార్తలు కూడా వినవచ్చాయి. రో హిత్ శర్మ కెప్టెన్సీలో ఆడేందుకు కోహ్లి ఇష్టపడడం లేదని అందుకే అతను సౌతాఫ్రికా వన్డే సిరీస్ నుంచి తప్పుకున్నాడని మంగళవారం పలు జాతీ య వార్తా సంస్థల్లో కథనాలు వచ్చాయి. టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత కోహ్లి భారత్ వెళ్లిపోతాడని అవి పేర్కొన్నాయి.
అంతేగాక భవిష్యత్తులో కూడా కోహ్లి వన్డేలకు అందుబాటులో ఉండే పరిస్థితి లేదని మరికొన్ని వార్త సంస్థలు కథనాలు వె లువరించాయి. కాగా, భారత క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని కోహ్లి జీర్ణించుకోలేక పోతున్నాడని, తనను ఉన్న ఫళంగా కెప్టెన్సీ నుంచి తప్పించడాన్ని అతను తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలిసిం ది. అందుకే బోర్డుకు ఝలక్ ఇచ్చేందుకు కోహ్లి సిద్ధమయ్యాడని వార్తలు వచ్చాయి. అయితే విరా ట్ కోహ్లి దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. తాను వన్డే సిరీస్‌కు దూరంగా ఉంటున్నట్టు అతను వెల్లడించలేదు. అయినా కూ డా జాతీయ మీడియాలో అతను తప్పుకుంటున్న ట్టు వార్తలు రావడం అభిమానులను కలవరానికి గురిచేస్తోంది. రానున్న రోజుల్లో పలు కీలకమైన టోర్నమెంట్‌లు, సిరీస్‌లు జరుగనున్న నేపథ్యంలో ఇద్దరు సీనియర్ క్రికెటర్ల మధ్య విభేదాలు తలెత్తడం జట్టుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. సమస్య తీవ్రంగా మారక ముందే బిసిసిఐ పెద్దలు దీనికి పరిష్కారం కనుగొనాల్సిందే.