Tuesday, April 8, 2025

విరాట్‌పై వేటు తప్పదా?

- Advertisement -
- Advertisement -

Virat Kohli failed so far in IPL 2022

ముంబై : టీమిండియా మాజీ సారధి, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీని వరుస వైఫల్యాలు వెంటాడుతున్నాయి. జట్టు ఏదైనా క్రీజులోకి దిగితే ప్రత్యార్థి బౌలర్లకు చుక్కలు చూపించే కోహ్లీ ఇప్పుడు కనుమరుగయ్యాడు. కోహ్లీ క్రీజులో ఉన్నంత సమయం ఎలా ఆడుతాడనే సందేహం కన్నా ఎప్పుడు ఔట్ అవుతాడనే భయమే ఎక్కువ అభిమానుల్లో నెలకొంది. కోహ్లీ మునుపటిలా బ్యాట్ ఝులిపించలేక పోతున్నాడు. దీంతో బెంగళూరు అభిమాల్లో తీవ్ర నిరాశ నెలకొంది. ఐపిఎల్ 2022 సీజన్ విరాట్ కోహ్లీకి పీడకలలా మారింది. ఈ సీజన్‌లో కోహ్లీ ఇప్పటి వరకూ 9 మ్యాచులు ఆడగా కేవలం 129 పరుగులు మాత్రమే సాధించగలిగాడు. అత్యంత పేలవ ప్రదర్శన కారణంగా ఈ సీజన్‌లో అతడి సగటు స్కోరు 16 పరుగులుగా మాత్రమే ఉంది. ఇక స్ట్రైక్ రేట్ కూడా అత్యంత చెత్తగా 119.63గా ఉంది. గత 10 ఐపిఎల్ సీజన్లలో ఇది రెండో చెత్త రికార్డ్. కాగా, ఈ సీజన్‌లో చివరిగా ఆడిన 3 మ్యాచుల్లో విరాట్ స్కోర్లు 0, 0, 9 పరుగులు ఉండటం కోహ్లీ పేలవత్వాన్ని చూపిస్తున్నయి. ఈ సీజన్ ఇప్పటి వరకు రెండు సార్లు గోల్డెన్ డకౌట్ కూడా కోహ్లీ పేరిటే ఉన్నాయి. అంటే ఆడిన తొలి బంతికే వికెట్ సమర్పించి పెవిలియన్ చేరడం అన్నమాట. కాగా ఇంతకంటే దారుణ ప్రదర్శన చివరిసారిగా ఐపిఎల్ 2008 సీజన్‌లో నమోదయింది.
విరాట్ చుట్టూ విమర్శలు..
ఈ వరుస పరాజయాలు అటు విరాట్ కోహ్లీ ఫామ్‌ను కూడా ఎత్తి చూపుతున్నాయి. అతని బ్యాటింగ్ ఫెయిల్యూర్ తాజాగా వివాదాలకు కేంద్రబిందువైంది. వన్‌డౌన్‌లో వచ్చే విరాట్ కోహ్లీ..రాజస్థాన్‌పై మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలో దిగాడు. అనూజ్ రావత్ స్థానంలో బ్యాట్ అందుకున్నాడు. కేప్టెన్ ఫాప్ డుప్లెసిస్‌తో కలిసి ఇన్నిం గ్ ఆరంభించాడు. ఈ ప్రయోగం బెడిసికొట్టింది. తొమ్మిది పరుగులకే వెనుదిరిగాడు కింగ్ కోహ్లీ. 145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ ఇన్నింగ్‌లో తొలి వికెట్ విరాట్ కోహ్లీదే. ఆ తరువాత ఛాలెంజర్స్ బ్యాటింగ్ తడబడింది. వరుసగా వికెట్లు పడ్డాయి. 115 పరుగులకు కుప్పకూలింది. దీంతో విరాట్‌పై పలువురు దిగ్గజాలు విమర్శలు గుప్పిస్తున్నారు.

Virat Kohli failed so far in IPL 2022

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News