Monday, December 23, 2024

ఫిట్‌నెస్‌పై విరాట్ దృష్టి

- Advertisement -
- Advertisement -

ముంబై: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాడు. సహచర క్రికెటర్లు తమ తమ కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతుండగా కోహ్లి మాత్రం ఫిట్‌నెస్ మెరుగు పరుచుకోవడంలో నిమగ్నమయ్యాడు. కొంత కాలంగా ఎడతెరిపి లేకుండా క్రికెట్ ఆడుతున్న కోహ్లి సెలవుల్లో పర్యాటక ప్రదేశాలకు వెళ్లకుండా జిమ్‌లోనే ఎక్కువ సేపు గడుపుతున్నాడు.

జిమ్‌లో కసరత్తు చేస్తున్న వీడియోను కోహ్లి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనికి సాకులు వెతుక్కుంటారా? లేదా ఫిట్‌నెస్ మెరుగుపరుచుకుంటారా అనే క్యాప్షన్‌ను జత చేశాడు. ఇది వైరల్‌గా మారింది. కాగా, టీమిండియా ఈ నెల చివర్లో వెస్టిండీస్ టూర్‌కు బయలుదేరి వెళ్లనుంది. అయితే ఈ సిరీస్ కోసం జట్టును ఇంకా ఎంపిక చేయలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News