Wednesday, January 22, 2025

విరాట్ కోహ్లీకి అరుదైన పురస్కారం

- Advertisement -
- Advertisement -

దుబాయ్: పరగుల మెషిన్, టీమిండియా మాజీ సారధి విరాట్ కోహ్లీ మరో అరుదైన పురస్కారం లభించింది. టి20 ప్రపంచ కప్ కోసం అమెరికా చేరుకున్న విరాట్ ఐసిసి నుంచి ఈ పురస్కారాన్ని అందుకున్నాడు. ఆదివారం ఐసిసి విరాట్‌కు ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందజేసింది. 2023లో అద్భుతమై బ్యాటింగ్‌తో పరుగుల వరద పారించిన కోహ్లీ.. ‘వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2023’ అవార్డుకు ఎంపికయ్యాడు. దీంతో వరల్డ్ కప్ సందర్భంగా ఆ ట్రోఫీని అందుకున్నాడు.

ఈ సందర్భంగా కోహ్లీ మాట్లాడుతూ. ‘దేవుడు ప్లాన్ చేసిన బేబీ’ ఇది. అంతేకాదు ఐసిసి షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో ‘వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ 2023 టోఫీని విరాట్ తలపై పెట్టుకొని ఖుషీ అవుతున్నాడు. ఇక భారత్ జట్టు 2023కు గానూ డిఐ టీమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకుంది. అందుకే వరల్డ్ కప్ కోసం న్యూయార్క్ చేరుకున్న టీమిండియా ఆటగాళ్లకు ఐసిసి ఈ టోపీలతో ఘన స్వాగతం పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News