Saturday, November 9, 2024

విరాట్‌కు మరో అరుదైన గౌరవం

- Advertisement -
- Advertisement -

లండన్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి అరుదైన గౌరవం దక్కింది. కోహ్లి ప్రతిష్టాత్మకమైన విజ్డెన్ వన్డే క్రికెటర్ ఆఫ్‌ది డికేడ్ (2010) అవార్డుకు ఎంపికయ్యాడు. ఈ ఏడాది ఆరంభంలో కూడా కోహ్లి ఓ అరుదైన అవార్డును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఐసిసి ప్రకటించిన మేల్ వన్డే క్రికెటర్ ఆఫ్‌ది దికేడ్ అవార్డును కూడా కోహ్లి గెలుచుకున్నాడు. తాజాగా విజ్డెన్ వన్డే క్రికెటర్ ఆఫ్‌ది డికేడ్ పురస్కారాన్ని కూడా సొంతం చేసుకున్నాడు. 2011 వన్డే వరల్డ్‌కప్‌తో దశాబ్దాన్ని ప్రారంభించిన కోహ్లి ఈ పదేళ్ల కాలంలో ఏకంగా 11వేలకు పైగా పరుగులు సాధించాడు. ఇందులో 42 సెంచరీలు కూడా ఉన్నాయి. ఇక ఐసిసి వన్డే టోర్నమెంట్‌లలో కోహ్లి అసాధారణ బ్యాటింగ్‌తో అలరించాడు. అతని అద్భుత బ్యాటింగ్ వల్లే ఐసిసి టోర్నీల్లో భారత్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. మరోవైపు విజ్డెన్ దశాబ్దపు టెస్టు జట్టు కెప్టెన్‌గా కూడా విరాట్ కోహ్లి ఎంపికయ్యాడు. అతని సారథ్యంలో దశాబ్దపు టెస్టు జట్టును విజ్డెన్ ప్రకటించింది. ఇక భారత్‌కే చెందిన స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ఈ జట్టుకు ఎంపికయ్యాడు.

Virat Kohli gets male ODI cricketer of Wisden decade

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News