Sunday, February 23, 2025

పాక్‌తో మ్యాచ్‌‌కి ముందు భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ?

- Advertisement -
- Advertisement -

దుబాయ్: ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీని బంగ్లాదేశ్‌పై విజయంతో భారత్ శుభారంభం చేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ గెలుపుతో ఉత్సహంలో ఉన్న భారత్.. ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. భారత్ పాకిస్థాన్ మ్యాచ్‌ అంటే అంచనాలు ఓ రేంజ్‌లో ఉంటాయి. తమ అభిమాన జట్టు గెలవాలని ఇరు దేశాల ఫ్యాన్స్ ప్రార్థనలు చేస్తుంటారు.

అయితే పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌కి ముందు భారత్‌కు ఓ గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు సమాచారం. మ్యాచ్‌కి ముందు ప్రాక్టీస్‌లో ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకి గాయం అయినట్లు తెలుస్తోంది. ఆఖరి ప్రాక్టీస్ సెషన్‌ ముగించుకొని వెళ్తున్న కోహ్లీ ఎడమకాలికి ఐస్ ప్యాక్ పెట్టుకొని కనిపించాడు. దీంతో కోహ్లీ పాక్‌తో జరిగే మ్యాచ్‌కి అందుబాటులో ఉంటాడో లేదో అని అభిమానులు కంగారు పడుతున్నారు. అయితే దీనిపై బిసిసిఐ మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News