Thursday, December 5, 2024

రెండో టెస్టుకు ముందు టీమిండియాకు షాక్..!

- Advertisement -
- Advertisement -

రెండో టెస్టు ఆరంభానికి ముందు టీమిండియాకు షాక్ తగిలింది. స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి గాయానికి గురైనట్టు తెలిసింది. కోహ్లి మోకాలికి బ్యాండేజి వేసుకుని ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. దీంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. కోహ్లి గాయానికి గురవడంతో అతను రెండో టెస్టులో పాల్గొనడంపై అనుమానాలు నెలకొన్నాయి. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాకున్నా గాయం తీవ్రత అధికంగా ఉంటే అతను ఈ మ్యాచ్‌లో పాల్గొనడం కష్టమే.

ఇదే జరిగితే టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బగానే చెప్పాలి. కాగా, తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లి అజేయ శతకం సాధించి ఫామ్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో భారత్ 295 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది. డిసెంబర్ 6 నుంచి ఆడిలైడ్ లో ఓవల్ స్టేడియంలో రెండో టెస్టు ప్రారంభం కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News