Wednesday, January 22, 2025

తీరు మారని విరాట్ కోహ్లి

- Advertisement -
- Advertisement -

Virat Kohli is failing miserably in all three formats

క్రీడా విభాగం: ఒకప్పుడూ ప్రపంచ క్రికెట్‌ను శాసించిన భారత రన్ మెషీన్ విరాట్ కోహ్లి ఇటీవల కాలంలో వరుస వైఫల్యాలు చవిచూస్తున్నాడు. కరోనాకు ముందు అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ ఎదురులేని శక్తిగా కొనసాగిన విషయం తెలిసిందే. ఫార్మాట్ ఏదైనా పరుగుల వరద పారించడం అలవాటుగా మార్చుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌పై అప్పట్లో కోహ్లి తనదైన ముద్ర వేశాడు. వన్డేలు, టెస్టులలో వరుస శతకాలతో పెను ప్రకంపనలు సృష్టించాడు. అన్ని జట్లపై కోహ్లి చెలరేగి పోయాడు. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, శ్రీలంక, విండీస్, కివీస్ తదితర జట్లపై పరుగుల వరద పారించాడు. ప్రపంచ క్రికెట్‌లోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా పేరు తెచ్చుకున్న కోహ్లి రెండు మూడేళ్లుగా వరుస వైఫల్యాలతో సతమతమవుతున్నాడు. మూడు ఫార్మాట్‌లలోనూ ఘోరంగా విఫలమవుతున్నాడు. భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న అత్యధిక సెంచరీల రికార్డును కోహ్లి తిరగరాయడం ఖాయమని భావించిన కోట్లాది మంది అభిమానులకు నిరాశే మిగిలింది. చాలా కాలంగా అంతర్జాతీయ మ్యాచుల్లో సెంచరీ సాధించడంలో కోహ్లి విఫలమవుతూ వస్తున్నాడు.

టెస్టులు, వన్డేలతో పాటు టి20లలో కూడా తేలిపోతున్నాడు. ఇటీవల ముగిసన ఐపిఎల్‌లో కూడా అంతంత మాత్రం బ్యాటింగ్‌నే కనబరిచాడు. ఇక టీమిండియాతో పాటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్సీ బాధ్యతల నుంచి కూడా కోహ్లి తప్పుకున్నాడు. సారథ్య భారం తగ్గినా విరాట్ కోహ్లి బ్యాటింగ్ మాత్రం గాడిలో పడడం లేదు. తాజాగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో కూడా నిరాశ పరిచాడు. ఈసారి భారీ స్కోరు సాధించడం ఖాయమని భావించగా 11 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఇంగ్లండ్ బౌలర్ పాట్స్ వేసిన బంతిని అంచన వేయడంలో విఫలమై క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఇక వరుస వైఫల్యాలు ఎదురవుతున్నా కోహ్లి తన బ్యాటింగ్‌ను మెరుగు పరుచుకోవడంపై దృష్టి సారించడం లేదు. అతని బ్యాటింగ్ ఇలాగే ఉంటే రానున్న రోజుల్లో టీమిండియాలో చోటు కాపాడుకోవడం కష్టమవుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. విరాట్ కోహ్లి వంటి దిగ్గజ బ్యాటర్ ఇలాంటి పేలవమైన ప్రదర్శనతో సతమతమవుతాడని ఎవరూ ఊహించలేక పోయారు. తన సమకాలిక ఆటగళ్లు జో రూట్, బాబర్ ఆజమ్, స్టీవ్ స్మిత్ తదితరులు సెంచరీల మీద సెంచరీలు సాధిస్తుంటే కోహ్లి కనీసం అర్ధ సెంచరీ మార్క్‌ను కూడా అందుకోలేక పోతున్నాడు. దీన్ని బట్టి విరాట్ ఫామ్ ఎంత పేలవంగా సాగుతుందో ఊహించుకోవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News