Sunday, January 5, 2025

కోహ్లి ఓ అద్భుతం: రికి పాంటింగ్

- Advertisement -
- Advertisement -

మెల్‌బోర్న్: టీమిండియా సీనియర్ క్రికెటర్ విరాట్ కోహ్లిపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికి పాంటింగ్ ప్రశంసలు కురిపించాడు. విరాట్ ఓ అద్భుత క్రికెటర్ అని కొనియాడాడు. ఒత్తిడిని సయితం తట్టుకుని ముందుకు సాగే తత్వం అతనిలో ఉందన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అతని బ్యాటింగ్‌ను ఎంత పొగిడినా తక్కువేనన్నాడు. తీవ్ర ఒత్తిడిని సయితం తట్టుకుంటూ అతను ఆడిన ఇన్నింగ్స్ కోహ్లి కెరీర్‌లో తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుందన్నాడు. కోహ్లిని చూసైనా ఆస్ట్రేలియా క్రికెటర్లు ఒత్తిడిని ఎలా జయించాలో తెలుసుకోవాలన్నాడు. రానున్న మ్యాచుల్లో కోహ్లి మరింత మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచడం ఖాయమన్నాడు. అతన్ని ఆపడం ఆతిథ్య జట్టు బౌలర్లకు అంత సులువు కాదన్నాడు. బోర్డర్‌గవాస్కర్ సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌ల్లో ఫలితం తేలడం ఖాయమని పాంటింగ్ జోస్యం చెప్పాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News