Friday, November 22, 2024

కోహ్లిని మించిన క్రికెటర్ లేడు

- Advertisement -
- Advertisement -

కరాచీ : ప్రపంచ క్రికెట్‌లోనే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని మించిన క్రికెటర్ లేడని పాకిస్థాన్ మాజీ సారథి సల్మాన్ బట్ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ఇటీవల న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్‌ను కోహ్లితో పోల్చుతూ చేసిన వ్యాఖ్యలను బట్ కొట్టి పోరేశాడు. సమకాలిన క్రికెట్‌లో కోహ్లిని మించిన ఆటగాడు ఎవరూ లేరన్నాడు. కేన్ విలియమ్సన్ ఏ దశలోనూ కోహ్లికి సరితూగడని బట్ స్పష్టం చేశాడు. బ్యాటింగ్‌తో పాటు దూకుడైన కెప్టెన్సీలో కోహ్లి చాలా పైచేయిలో ఉంటాడన్నాడు. అతనితో పోటీ పడే కెప్టెన్ కానీ, బ్యాట్స్‌మన్‌గానీ ఎవరూ కనిపించడం లేదన్నాడు. ప్రపంచ క్రికెట్‌లో కోహ్లి ఓ ట్రెండ్ అని అతనితో ఇతర క్రికెటర్లను పోల్చడం సరికాదన్నాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లి ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడని బట్ ప్రశంసించాడు. భవిష్యత్తులో కూడా విరాట్ మరెన్నో రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని జోస్యం చెప్పాడు. ఫార్మాట్ ఏదైనా పరుగుల వరద పారించడం ఒక్క విరాట్‌కు మాత్రమే సాధ్యమన్నాడు. అతనిలా నిలకడగా బ్యాటింగ్ చేయడం అందరికి సాధ్యం కాదని సల్మాన్ బట్ పేర్కొన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News