Monday, December 23, 2024

కోహ్లి ర్యాంక్ మెరుగు

- Advertisement -
- Advertisement -

Virat Kohli moves to 7th in latest ICC Test rankings

టాప్10లో బుమ్రా

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం ప్రకటించిన తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి బ్యాటింగ్ విభాగంలో ఏడో ర్యాంక్‌కు చేరుకున్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన చివరి టెస్టులో మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచిన కోహ్లి తాజా ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలను మెరుగుపరుచుకున్నాడు. ఇక రోహిత్ శర్మ తన ఐదో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. రోహిత్ 773 పాయింట్లతో ఐదో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. ఇక ఆస్ట్రేలియా స్టార్ మార్నస్ లబుషేన్ 935 పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. జో రూట్ (ఇంగ్లండ్) రెండో, కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మూడో ర్యాంక్‌లో నిలిచారు. ఒక ర్యాంక్‌ను కోల్పోయిన స్టీవ్ స్మిత్ నాలుగో ర్యాంక్‌లో నిలిచాడు. ఇక యాషెస్ సిరీస్‌లో అద్భుతంగా రాణించిన ట్రావిస్ హెడ్ తాజా ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానానికి చేరుకున్నాడు.

ట్రావిస్ హెడ్ ఏకంగా ఏడు ర్యాంక్‌లను మెరుగు పరుచుకోవడం విశేషం. ఇక దిముత్ కరుణరత్నె (శ్రీలంక) 8వ, బాబర్ ఆజమ్ (పాకిస్థాన్) 9వ ర్యాంక్‌లో నిలిచారు. ఇక కివీస్ ఆటగాడు టామ్ లాథమ్ ఒక ర్యాంక్‌ను మెరుగు పరుచుకుని టాప్10లో చోటు సంపాదించాడు. బౌలింగ్ విభాగంలో పాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా) 898 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన రెండో ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. మరోవైపు స్పీడ్‌స్టర్ జస్‌ప్రీత్ బుమ్రా టాప్ టెన్ ర్యాంక్‌లో చోటు దక్కించుకున్నాడు. మూడు ర్యాంక్‌లను మెరుగు పరుచుకున్న బుమ్రా పదో స్థానంలో నిలిచాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News