Saturday, November 23, 2024

కోహ్లీ వర్సెస్ మెస్సీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పుబెటి అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డు కోసం ప్రపంచ మేటి ఆటగాళ్లు పోటీ పడుతున్నారు. వారిలో ఒకరి ప్రపంచ క్రికెట్‌లో అలుపెరుగని పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ, మరోకరు ఫుట్‌బాల్ లెజెండరీ ఆటగాడు లియోనల్ మెస్సీ. తమ ఆటతీరుతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ ద్వయం 2023లో ఘనంగా రాణించి ఈ అవార్డు రేసులో నిలిచారు.

విరాట్ కోహ్లీ.. 2023లో పరుగుల వరద పారించి రికార్డులు బద్దలు కొడితే, మెస్సీ.. గోల్సమ వర్షం కురిపించాడు. ఇక విరాట్ సొంత గడ్డపై ఇటీవలె జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో శతకాల మోత మోగించిన మాస్టర్ బ్లాస్టర్ పేరిట ఉన్న 49 సెంచరీల రికార్డును బద్దలు కొట్టాడు. దీంతో వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. నిరుడు ఖతర్‌లో జరిగిన ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో అద్భుతమైన ఆటతీరుతో అర్జెంటీనాను రెండోసారి విశ్వవిజేతగా నిలిపాడు. ఈ టైటిల్ పోరులో అర్జెంటీనా నాలుగు గోల్స్ సాధించగా అందులో మెస్సీ మేసిన 2 గోల్స్ వేసి జట్టును విజయతీరాలకు చేర్చి, ప్రపంచ కప్ కప్ ముద్దాడటంలో కీలక పాత్ర పోషించాడు.

వరల్డ్ కప్ అనంతరం సొంత జట్టునేఉ వీడిన మెస్సీ ఇంటరఃమ మియామి క్లబ్‌తో ఒప్పంద చేసుకొని మేజర్ సాగర్ లీగ్‌లో ఆ జట్టును విజేతగా నిలిపాడు. అంతేకాదు, ఏడాదంతా అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్న మెప్సీ ‘బాలెన్ డీ ఓర్’ అవార్డును సయితం కైవసం చేసుకున్నాడు. దీంతో పుబెటి అవార్డు ఎవరిని వరించనుందనే సర్వత్రా ఆసక్తిగా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News