Sunday, January 5, 2025

కోహ్లీ ఔట్… భారత్ 76/4

- Advertisement -
- Advertisement -

సిడ్నీ: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదో టెస్టు మొదటి ఇన్నింగ్స్ తొలి రోజు టీమిండియా 32 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 76 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. కెఎల్ రాహుల్ నాలుగు పరుగులు చేసి మిచెల్‌సార్క్ బౌలింగ్‌లో శామ్ కోన్‌స్టాస్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. యశస్వి జైస్వాల్ పది పరుగులు చేసి బోలాండ్ బౌలింగ్‌లో వెబ్‌స్టర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. శుబ్‌మన్‌గిల్ 20 పరుగులు చేసి లయన్ బౌలింగ్‌లో స్టీవెన్ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. విరాట్ కోహ్లీ 17 పరుగులు చేసి బోలాండ్ బౌలింగ్‌లో వెబ్‌స్టర్‌కు క్యాచ్ ఇచ్చి వికెట్ కోల్పోయాడు. ప్రస్తుతం క్రీజులో రిషబ్ పంత్(10), రవీంద్ర జడేజా(03) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News