Saturday, September 21, 2024

విరాట్ ఔట్‌… రోహిత్ ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

చెన్నై: బంగ్లాదేశ్-టిమిండియా మధ్య జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ ఎల్‌బి డబ్ల్యు రూపంలో ఔటయ్యాడు. కోహ్లీ 36 బంతుల్లో 17 పరుగులు చేసి స్పిన్నర్ మెహిదీ హసన్ బౌలింగ్‌లో ప్యాడ్‌కు తాకడంతో ఎంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. కానీ రిప్లేలో నాటౌట్‌గా తేలడంతో కెప్టెన్ రోహిత్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశాడు. డిఆర్‌ఎస్‌లు ఉండి కూడా సమీక్ష ఎందుకు కోరలేదని రోహిత్ కోపం తెచ్చుకున్నాడు. సమీక్ష కోరి ఉంటే నాటౌట్ వచ్చేదని రిప్లే చూసిన తరువాత రోహిత్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. గత కొంత కాలంగా ఆప్ స్పిన్ ఆడటంలో విరాట్ కోహ్లీ ఇబ్బంది పడుతున్నాడు. ఆఫ్ స్పిన్‌లో 31 సార్లు ఔటయ్యాడు. మూడో రోజు ప్రారంభంలో టీమిండియా 322 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News