- Advertisement -
హైదరాబాద్: ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ బ్యాట్స్మన్ గానే కాక ఎంటర్ప్రెన్యూర్ గా కూడా ప్రసిద్ధుడే. ప్రసిద్ధ ‘వన్ 8 కమ్యూన్’, ‘న్యూవ’ అనే రెస్టారెంట్ చైన్లకు అతడు యజమాని. 2017లో ఆరంభించిన ‘వన్ 8 కమ్యూన్’ అవుట్ లెట్లు ఢిల్లీ, ముంబై, పుణే, కోల్ కతా, బెంగళూరులో ఉన్నాయి. వాటిలో రుచికరమైన వంటకాలు లభిస్తాయి. రెస్టారెంట్ వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది.
ఇప్పుడు కోహ్లీ హైదరాబాద్ లో కూడా తన ‘వన్ 8 కమ్యూన్’ బ్రాంచీని తెరుస్తుండడం అతడి అభిమానుల్లో ఉత్సాహాన్ని రేపుతోంది. హైదరాబాద్ లోని హైటెక్ సిటీ ఏరియాలో ఈ రెస్టారెంట్ వస్తోంది. దానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
- Advertisement -