Monday, December 23, 2024

బాబర్ అజాంపై కోహ్లీ పొగడ్తలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ సారధి విరాట్ కోహ్లీ.. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌పై పొగడ్తలు కురిపించాడు. బాబర్ ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడని చెప్పుకొచ్చాడు. బాబర్ మూడు ఫార్మాట్లలోనూ తిరుగులేని బ్యాటర్ అని అన్నాడు. స్టార్ స్పోర్ట్స్‌తో చిట్‌చాట్‌లో కోహ్లీ ఈ విషయాలను పంచుకున్నాడు. 2019 వన్డే వరల్డ్‌కప్ సమయంలో విరాట్ కోహ్లీ.. బాబర్ ఆజాంతో ముచ్చిట్టించిన విషయం తెలిసిందే. ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న కోహ్లీ.. బాబర్ చాలా మర్యాదస్తుడని, అప్పటి పాక్ జట్టు ఆటగాడు ఇమాద్ వసీంతో తనకు పరిచయం ఉందన్న కోహ్లీ మ్యాచ్ అనంతరం బాబర్ తనతో మాట్లాడాలని అనుకుంటున్నట్లు ఇమాద్ చెప్పాడని తెలిపాడు. తనే బాబర్‌ను పరిచయం చేసినట్లు చెప్పుకొచ్చాడు పరుగుల యంత్రం.

కాగా ఆసియా కప్-2023లో భాగంగా సెప్టెంబర్ 2న భారత్-పాక్ మ్యాచ్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌కు శ్రీలంకలోని పల్లెకెలె ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ టోర్నీలో భారత్, పాక్‌లు మూడుసార్లు తలపడే అవకాశం ఉంది. ఆపై వన్డే ప్రపంచకప్‌లో భాగంగా అక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదికగా మరోసారి తలపడనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News