Sunday, January 19, 2025

బెంగళూరు చేరుకున్న విరాట్ కోహ్లీ

- Advertisement -
- Advertisement -

టీమిండియా బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ లండన్ నుంచి బెంగళూరు చేరుకున్నాడు. అతడు భారత్ గడ్డ అడుగుపెట్టడంతో ఆర్‌సిబి అభిమానులకు ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. తన భార్య ప్రసవం గత రెండు నెలల నుంచి విరాట్ లండన్‌లో ఉండిపోయాడు. ఐపిఎల్ 2024 ప్రారంభానికి మూడు రోజుల ముందే కోహ్లీ బెంగళూరు చేరుకున్నాడు. ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సభ్యులతో ఆయన కలువనున్నాడు. గత మూడు నెలల నుంచి క్రికెట్ అతడు దూరంగా ఉన్నాడు, వ్యక్తిగత కారణాలతో ఇంగ్లాండ్ జరిగే టెస్టు సిరీస్ కోహ్లీ అందుబాటులో లేడు. ఐపిఎల్ 2024 నుంచి మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంతో పాటు తొలి మ్యాచ్ ఆర్‌సిబి వర్సెస్ సిఎస్‌కె మధ్య జరుగనుంది.

ఆర్‌సిబి జట్టు: ఫాఫ్ డుప్లెసిస్(కెప్టెన్), విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్, రజత్ పాటీదార్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, అనుజ్ రావత్, మహిపాల్ లోమ్రోర్, కామెరాన్ గ్రీన్, మనోజ్ భాండాగే, సుయాస్ ప్రభుదేశాయ్, మాయాన్సెక్, లాకీ ఫెర్గూసన్, యష్ దయాల్, మయాన్స్‌క్ టాప్లీ, స్వప్నిల్ సింగ్, కర్ణ్ శర్మ, రాజన్ కుమార్,  హిమాన్షు శర్మ, విజయ్ కుమార్ వైషాక్, అల్జారీ జోసెఫ్,  టామ్ కర్రాన్,  సౌరవ్ చౌహాన్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News