హైదరాబాద్: టీమిండియా బ్యాట్స్‌మెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించారు. ఏడు క్యాలెండర ఇయర్లలో రెండు వేల పరుగులు చేసిన క్రికెటర్‌గా విరాట్ చరిత్రలోకెక్కాడు. 1877 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 146 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఈ రికార్డును ఎవరు సొంతం చేసుకోలేకపోయారు, కానీ విరాట్ వల్లనే సాధ్యమైంది. విరాట్ కోహ్లీ 2012లో (2182 పరుగులు), 2014లో(2286 పరుగులు), 2016లో(2595 పరుగులు), 2017లో(2818 పరుగులు), 2018లో(2735 పరుగులు), 2019లో(2455 పరుగులు) చేశారు.
దక్షిణాఫ్రికా ఆడుతున్న తొలి టెస్టులో విరాట్ మొదటి ఇన్నింగ్ 38, రెండు ఇన్నింగ్స్ లో 76 పరుగులు చేశారు. దీంతో రెండు వేల పరుగుల మైలు రాయిని దాటాడు. శ్రీలంక ఆటగాడు కుమార సంగక్కర్ ఆరు క్యాలెండర్ ఇయర్‌లలో 2000 కంటే ఎక్కువగా పరుగులు చేశారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్థనే ఐదు సార్లు చేశారు. మాథ్యూ హేడెన్, సౌరవ్ గంగూలీ, రికీ పాంటింగ్, జాక్వెస్ కలిస్ నాలుగు సార్లు ఈ ఘనత సాధించారు.
క్రికెట్ చరిత్రలో ఎవరికి సాధ్యంకాని రికార్డు విరాట్ ఖాతాలో
- Advertisement -
- Advertisement -
- Advertisement -