Saturday, November 9, 2024

క్లీన్‌స్వీప్‌పై టీమిండియా కన్ను

- Advertisement -
- Advertisement -
Virat Kohli Rishabh Pant Given Break By BCCI
కోహ్లి, రిషబ్‌లకు విశ్రాంతి, నేడు విండీస్‌తో చివరి టి20

కోల్‌కతా : ఇప్పటికే సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమిండియా ఆదివారం విండీస్‌తో జరిగే చివరి టి20లోనూ విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. శుక్రవారం ఉత్కంఠభరితంగా సాగిన రెండో టి20లో భారత్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఆఖరి మ్యాచ్‌లో నూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని తహతహలాడుతోంది. మరోవైపు విండీస్ కూడా ఆఖరి మ్యాచ్‌లో విజయమే లక్ష్యంగా పెట్టుకుంది. కిందటి మ్యాచ్‌లో విజయం అంచుల వరకు వచ్చి ఓటమి పాలైంది. అయితే చివరి టి20లో మాత్రం ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఆడి విజయం అందుకోవాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో భారత్ కీలక ఆటగాళ్లు విరాట్ కోహ్లి, వికెట్ కీపర్ రిషబ్ పంత్‌లకు విశ్రాంతి ఇచ్చింది. రానున్న సుదీర్ఘ సిరీస్‌లను దృష్టిలో ఉంచుకొని ఈ ఇద్దరు ఆటగాళ్లను చివరి మ్యాచ్ నుంచి తప్పించింది. వీరు లేకుండానే ఈ మ్యాచ్‌లో టీమిండియా బరిలోకి దిగనుంది. రిషబ్ స్థానంలో ఇషాన్ కిషన్ వికెట్ కీపింగ్ చేపట్టే అవకాశాలున్నాయి.

రుతురాజ్‌కు చోటు?

చివరి టి20లో టీమిండియా ప్రయోగాలకు దిగే అవకాశాలున్నాయి. తొలి రెండు మ్యాచుల్లో పెవిలియన్‌కే పరిమితమైన యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఈ మ్యాచ్‌లో ఆడడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే జరిగితే కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించడం ఖాయం. ఇక ఫామ్‌లో ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. కోహ్లి, రిషబ్ దూరమైన నేపథ్యంలో రోహిత్ బాధ్యత మరింత పెరిగింది. జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత రోహిత్‌పై నెలకొంది. ఇక తొలి రెండు మ్యాచుల్లో తన స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచడంలో విఫలమైన ఇషాన్ కిషన్ కూడా ఈసారి ధాటిగా ఆడాలనే పట్టుదలతో ఉన్నాడు. అతను కూడా జట్టుకు కీలకంగా మారాడు. ఇటీవల కాలంలో అద్భుతంగా రాణిస్తున్న సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్‌లు కూడా మరోసారి సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన వీరిద్దరూ చెలరేగితే విండీస్‌కు మరోసారి కష్టా లు తప్పక పోవచ్చు. వెంకటేశ్ అయ్యర్, దీపక్ హుడా వంటి యువ ఆటగాళ్లు కూడా జట్టుకు అందుబాటులో ఉన్నారు. బౌలింగ్‌లో కూడా టీమిండియా బలంగానే ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News