Monday, December 23, 2024

ఇంగ్లండ్ తో రెండు టెస్టులకు కోహ్లీ దూరం

- Advertisement -
- Advertisement -

ఇంగ్లండ్ తో ఈనెల 25నుంచి మొదలయ్యే ఐదు టెస్టుల సీరీస్ లో మొదటి రెండు టెస్టులకూ టీమిండియా స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండటం లేదు. వ్యక్తిగత కారణాల వల్ల తాను మొదటి రెండు టెస్టులూ ఆడలేనని కోహ్లీ బిసిసిఐకి సమాచారం ఇచ్చాడు. ఈ సమాచారాన్ని బిసిసిఐ ఎక్స్ లో పోస్ట్ చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ కూడా ఈ టెస్ట్ సీరీస్ లో ఆడటం లేదు. బ్రూక్ కూడా వ్యక్తిగత కారణాల వల్లే ఈ సీరీస్ లో ఆడలేకపోతున్నట్లు పేర్కొన్నాడు.

ఇదిలా ఉండగా, హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో గురువారం ప్రారంభమయ్యే తొలి మ్యాచ్ కోసం టీమిండియా ఆటగాళ్లు ఆదివారం ప్రాక్టీస్ లో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News