ముంబై: ఫెయిల్యూర్ కెప్టెన్ అని తనపై వచ్చిన విమర్శలను ఎప్పుడూ పట్టించుకోలేదని టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి పేర్కొన్నాడు. ఆటగాడిగా ఎన్నో రికార్డులను సాధించినా కెప్టెన్‌గా మాత్రం తాను అభిమానుల ఆశలను నెరవేర్చలేక పోయానని స్పష్టం చేశాడు. కెప్టెన్‌గా, ఆటగాడిగా తన బాధ్యతను వంద శాతం నిర్వర్తించేందుకే ప్రయత్నించానన్నాడు. అయితే దురదృష్టవశాత్తు తన సారథ్యంల ఒక్క ఐసిసి ట్రోఫీ కూడా లభించక పోవడం ఎంతో బాధకు గురి చేసిందన్నాడు.
ఈ విషయంలో తనపై వచ్చిన విమర్శలను తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం లేదన్నాడు. ఏ అభిమాని అయినా జట్టు ట్రోఫీ సాధించాలని మాత్రమే కోరుకుంటాడని, అది నెరవేర్చని ఏ కెప్టెన్‌పైనా కూడా ఇలాంటి విమర్శలు రావడం సహాజమేనన్నాడు. ఇక మహేంద్ర సింగ్ ధోనీ నుంచి ఎన్నో మెళకువలు నేర్చుకున్నానని, తాను సారథిగా సాధించిన విజయాల్లో అతని పాత్ర చాలా కీలకమని కోహ్లి వివరించాడు.