Monday, March 17, 2025

అదే జరిగితే టి20లో మళ్లీ ఆడతా..: విరాట్ కోహ్లి

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: అమెరికాలోని లాస్ ఏంజిల్స్ వేదికగా 2028లో జరిగే విశ్వ క్రీడలు ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చోటు కల్పిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి స్పందించాడు. లాస్ ఏంజిల్స్‌లో క్రికెట్‌కు చోటు దక్కడం ఎంతో ఆనందం కలిగించే అంశమన్నాడు. ఒకవేళ ఈ ఒలింపిక్స్‌లో టీమిండియా ఫైనల్‌కు చేరితే ఆ మ్యాచ్‌లో ఆడేందుకు తాను రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటానని కోహ్లి పేర్కొన్నాడు. ఒలింపిక్స్‌లో పతకం సాధించడ కంటే జీవితంలో ముఖ్యమైన అంశం ఏదీ ఉండదన్నాడు. విశ్వక్రీడల్లో క్రికెట్‌కు చోటు దక్కితే భారత్ పతకం సాధించే అవకాశాలు మెరుగ్గా ఉంటాయన్నాడు. ఇక ఈ క్రీడల్లో భారత జట్టు తుది పోరుకు అర్హత సాధిస్తే తాను తప్పకుండా ఆ మ్యాచ్‌లో ఆడతానని, దీని కోసం రిటైర్మెంట్ అంశంపై యు టర్న్ తీసుకుంటానని తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News