Monday, December 23, 2024

కోహ్లీకి కరోనా?

- Advertisement -
- Advertisement -

Virat Kohli test positive for Covid 19

లండన్: ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టు మ్యాచ్ ఆడేందుకు లండన్‌కు చేరుకున్న టీమిండియాను కరోనా కష్టాలు వెంటాడుతున్నాయి. ఈ టెస్టు జులై 1 నుంచి ప్రారంభం కానుండగా మాజీ సారధి, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ కరోనా బారిన పడినట్లు కొన్ని మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న ఈ సీనియర్ ఆటగాడు. భార్య అనుష్కశర్మ, కూతురు వామికాతో కలిసి మాల్దీవులకు విహార యాత్రకు వెళ్లినట్టు అక్కడ వారంతా కరోనా బారిన పడ్డట్టు ఆయా మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. అయితే కోహ్లీ కరోనా నుంచి కోలుకున్న తరువాతే టీమిండియాతో కలిసి లండన్ బయల్దేరి వెళ్లాడని ఆ వార్తల్లో పేర్కొన్నాయి. కాగా, ఈ విషయంపై భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇదిలా ఉండగా టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సయితం కరోనా బారిన పడి పూర్తిగా కోలుకున్నాడని, టెస్టు మ్యాచ్ ఆడేందుకు బుధవారం లండన్ బయల్దేరినట్టు తెలుస్తోంది.

Virat Kohli test positive for Covid 19

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News