- Advertisement -
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం లభించింది. రాజస్థాన్‌లోని జైపూర్ వ్యాక్స్ మ్యూజియంలో కోహ్లి మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకుని కోహ్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్టు మ్యూజియం వ్యవస్థాపక డైరెక్టర్ అనూప్ శ్రీవాస్తవ పేర్కొన్నాడు. మ్యూజియంలో కోహ్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని పిల్లలు, యువత నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వచ్చాయన్నారు. వారి డిమాండ్ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు.
- Advertisement -