Friday, December 20, 2024

ఆ మూడు రోజులు విరాట్ ఎక్కడికి వెళ్లాడో చెప్పిన బిసిసిఐ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టీమిండియా దక్షిణాఫ్రికా టూర్‌లో ఉంది. ఇప్పటి వన్డే సిరీస్ గెలిచి టీమిండియా దూకుడు ప్రదర్శిస్తోంది. సీనియర్ ఆటగాళ్లంతా ఇప్పటికే దక్షిణాఫ్రికాకు చేరుకొని ప్రాక్టీస్ మొదలు పెట్టారు. దక్షిణాఫ్రికాకు వెళ్లిన విరాట్ కోహ్లీ తిరిగి భారత్‌కు వచ్చాడు. భారత్ నుంచి నేరుగా లండన్‌కు వెళ్లాడు. విరాట్ సెలవు తీసుకొని మూడు రోజులు లండన్‌లో ఉన్నారని బిసిసిఐ మేనేజ్‌మెంట్ తెలిపింది. ముందుగానే తమ దగ్గర సెలవు తీసుకొని లండన్ వెళ్లాడని బిసిసిఐ వర్గాలు వెల్లడించాయి. డిసెంబర్ 19న లండన్ వెళ్లడానికి ముందు పలు ట్రైనింగ్ సెషన్‌లలో విరాట్ పాల్గొన్నాడని బిసిసిఐ అధికారులు తెలిపారు. డిసెంబర్ 26 నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఇప్పటివరకు సౌతాఫ్రికా గడ్డమీద టీమిండియా ఒక్క టెస్టు సిరీస్ గెలవలేదు. ఈ సారి టెస్టు సిరీస్ గెలిచి రికార్డు సృష్టించాలని టీమిండియా ఉవ్విళ్లూరుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News