Sunday, December 22, 2024

చివరి టెస్టులో విరాట్ ఆడతాడు: ద్రవిడ్

- Advertisement -
- Advertisement -

Virat Kohli will play in final Test against South Africa:Dravid

 

జోహెన్నస్‌బర్గ్: దక్షిణాఫ్రికాతో జరిగే చివరి టెస్టులో కెప్టెన్ విరాట్ కోహ్లి బరిలోకి దిగే అవకాశాలు అధికంగా ఉన్నాయని టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ పేర్కొన్నాడు. వెన్ను నొప్పితో బాధపడుతున్న కోహ్లి రెండో టెస్టుకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. కోహ్లి లేని లోటు రెండో టెస్టులో స్పష్టంగా కనిపించింది. ఇలాంటి స్థితిలో కోహ్లి కీలకమైన మ్యాచ్‌లో ఆడడం ఖాయమన్నాడు. చివరి టెస్టు ఆరంభానికి ఇంకా సమయం ఉండడంతో అప్పటి వరకు కోహ్లి పూర్తి ఫిట్‌నెస్ సాధించే అవకాశం ఉందన్నాడు. ఇక జోహెన్నస్‌బర్గ్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా లేదన్నాడు. దీంతో ఇరు జట్ల బ్యాట్స్‌మెన్ పరుగులు సాధించడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందన్నాడు. ఇక సీనియర్లు పుజారా, రహానె ఫామ్‌లోకి రావడం జట్టుకు శుభసూచకంగా ద్రవిడ్ అభివర్ణించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News