Wednesday, January 22, 2025

తొలి రెండు టెస్టులకు కోహ్లి దూరం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇంగ్లండ్‌తో జరిగే తొలి రెండు టెస్టు మ్యాచ్‌లకు టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి అందుబాటులో ఉండడం లేదు. వ్యక్తిగత కారణాలతో కోహ్లి ఈ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని బిసిసిఐ ఎక్స్ (ట్విటర్)లో వెల్లడించింది. తప్పనిసరి పరిస్థితుల్లో తాను తొలి రెండు టెస్టులకు అందుబాటులో ఉండడం లేదని కోహ్లి బిసిసిఐకి తెలిపాడు. అంతేగాక ఇదే విషయాన్ని కెప్టెన్ రోహిత్ దృష్టికి కూడా తీసుకెళ్లాడు. ఇక కోహ్లి తీసుకున్న నిర్ణయానికి రోహిత్‌తో పాటు బిసిసిఐ మద్దతు తెలిపింది. దీంతో హైదరాబాద్, విశాఖపట్నం వేదికలుగా ఇంగ్లండ్‌తో జరిగే మొదటి రెండు టెస్టు మ్యాచ్‌లకు కోహ్లి దూరమయ్యాడు. కాగా, కోహ్లి స్థానంలో ఎవరినీ జట్టులోకి తీసుకోలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News