బెంగళూరు: దూకుడుకు నిదర్శనం కోహ్లీ, ఐపిఎల్‌లో మైదానంలోకి దిగాడంటే చాలు ప్రత్యర్థి టీమ్‌లో టీమిండియా ఆటగాడు ఉన్న అలానే ప్రవర్తిస్తాడు. తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో బెంగళూరు విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో బెంగళూరుపై లక్నో విజయం సాధించడంతో ప్రతీకారంగా రెండో మ్యాచ్‌లో బెంగళూరు గెలిచింది. లక్నో మెంటర్ గౌతమ్‌గంభీర్-విరాట్ కోహ్లీ మధ్య గొడవ జరగడంతో పాటు తారాస్థాయికి చేరుకుంది. బెంగళూరు బౌలర్ సిరాజ్ వేసిన బంతి లక్నో బ్యాట్స్‌మెన్ నవీన్ ప్యాడ్లకు తాకింది. సిరాజ్ బంతిని అందుకొని వెంటనే వికెట్ల వైపు విసిరాడు.
Also Read: సన్‌రైజర్స్ రాత మారేనా?.. నేడు రాస్థాన్‌తో కీలక పోరు
అప్పటికే నవీన్ క్రీజులో ఉండడంతో అసహనం వ్యక్తం చేశాడు. దీంతో నవీన్-సిరాజ్ మధ్య గొడవ జరగడంతో మధ్యలోకి కోహ్లీ వచ్చి చేరి గొడవను పెద్దది చేశాడు. అమిత్ మిశ్రా వచ్చి ముగ్గురిని శాంతింప చేశాడు. దీంతో బిసిసిఐ కోహ్లీ, గంభీర్‌లకు వంద శాతం, నవీనుల్‌కు 50 శాతం మ్యాచ్‌లో ఫీజు కోత విధించింది. విరాట్ తరపున బెంగళూరు జట్లు యాజమాన్యం రూ.1.07 కోట్లు జరిమానా చెల్లించింది. దీంతో అంత పెద్ద తప్పు తాను ఏం చేశానని బిసిసిఐకి విరాట్ కోహ్లీ లేఖ రాశారు. తాను కావాలని ఎవరితో ఘర్షణకు దిగలేదని, ముందు వారే తన టీమ్‌ను రెచ్చగొట్టారని, దానికి మాత్రమే తాను సమాధానం ఇచ్చానని చెప్పుకొచ్చారు. వంద శాతం మ్యాచ్ ఫీజులో కోత విధించేంత తప్పు చేయలేదన్నారు.