Monday, December 23, 2024

మానవ స్వేఛ్చలో ప్రేమ ఒక భాగమని చెప్పాం

- Advertisement -
- Advertisement -

VIRATA PARVAM Movie Pre Release Event

”సాయి పల్లవి కెరీర్‌లో ‘విరాటపర్వం’ ఒక బెస్ట్ ఫిల్మ్. ఇందులో నటనకుగాను సాయి పల్లవికి జాతీయ అవార్డు వస్తుంది”అని అన్నారు విక్టరీ వెంకటేష్. పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి, సహజ నటి సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న చిత్రం ’విరాటపర్వం’. డి. సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రానుంది. ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ “రానా తన తొలి సినిమా లీడర్ నుండి ఇప్పటి వరకూ తన ప్రతి సినిమాని, పాత్రని ఎంతో అంకిత భావంతో చేస్తున్నాడు. అతను ‘విరాట పర్వం’ చేసినందుకు చాలా ఆనందంగా వుంది. మన తెలుగు చిత్ర పరిశ్రమకి ఒక నిజాయితీ గల ఫిల్మ్ మేకర్ వేణు రూపంలో దొరకడం ఆనందంగా వుంది. ఇక వెన్నెల పాత్రని అద్భుతంగా పోషించారు సాయి పల్లవి”అని అన్నారు. హీరో రానా మాట్లాడుతూ “దర్శకుడు వేణు ఉడుగుల ఎంతో నిజాయితీతో ఒక అద్భుతమైన ప్రేమకథని చేశారు. సాయి పల్లవి నడుస్తుంటే పక్కన వెన్నెల తిరుగుతున్నట్లు వుంటుంది. సాయి పల్లవి లేకపోతే ఈ సినిమా వుండేది కాదు”అని తెలిపారు. సాయి పల్లవి మాట్లాడుతూ “విరాట పర్వం… నా కెరీర్ లో చాలా ముఖ్యమైన సినిమా అవుతుంది.

యదార్థ సంఘటనల ఆధారంగా నేను ఇప్పటివరకూ సినిమాలు చేయలేదు. ‘విరాట పర్వం’ చాలా కొత్త, గొప్ప అనుభూతినిచ్చింది. ప్రేక్షకులకు కూడా అలాంటి అనుభూతే కలుగుతుందని నమ్ముతున్నాను” అని చెప్పారు. దర్శకుడు వేణు ఉడుగుల మాట్లాడుతూ “తెలుగు సినిమా చరిత్రలో గూడవల్లి రామబ్రహ్మం,ప్రకాష్ కోవెలమూడి, టి.కృష్ణ, నేడు సుకుమార్.. వీరందరి స్ఫూర్తితోనే నా మూలాల్లోకి వెళ్లి తీసిన సినిమా విరాట పర్వం. ఇందులో హింసని గ్లామర్‌గా చూపించలేదు. ప్రేమ దైవమని చెప్పాం. మానవ స్వేఛ్చలో ప్రేమ ఒక భాగమని చెప్పాం. ప్రేమకి మించిన ప్రజాస్వామిక విలువ ఈ భూమి మీద ఏదీ లేదని చెప్పాం”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ చెరుకూరి, శ్రీకాంత్, నవీన్ చంద్ర, కిషోర్ తిరుమల, శరత్ మండవ, రాహుల్ రామకృష్ణ, జరీనా వహేబ్, ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు.

VIRATA PARVAM Movie Pre Release Event

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News