Sunday, December 22, 2024

సాయి పల్లవి గొప్పగా నటించింది

- Advertisement -
- Advertisement -

పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి, లేడి పవర్ స్టార్ సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న చిత్రం ’విరాటపర్వం’. 1990లో సరళ అనే అమ్మాయి నిజ జీవితంలో జరిగిన యధార్ధ సంఘటనల ఆధారంగా డి. సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్ర బృందంతో పాటు సరళ అన్నయ్య తూము మోహన్ రావు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ.. “సురేష్ ప్రొడక్షన్‌లో తొలిసారి యధార్ధ సంఘటనల ద్వారా తెరకెక్కిన చిత్రం విరాటపర్వం. దర్శకుడు వేణు కథని అద్భుతంగా చెప్పారు. సాయి పల్లవి గొప్పగా నటించింది. విరాట పర్వం విజయం ఆనందాన్ని ఇచ్చింది. మేము కూడా ఒక మంచి బయోపిక్ చేశామనే తృప్తిని ఇచ్చింది విరాటపర్వం. సరళ జీవితాన్ని సినిమాగా తీసుకునే అవకాశం ఇచ్చిన వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు. ఇది స్వచ్చమైన ప్రేమ కథ. రానా, మిగతా నటీనటులు అందరూ గొప్పగా చేశారు”అని తెలిపారు.

సాయి పల్లవి మాట్లాడుతూ “సరళ కుటుంబాన్ని చూసిన తర్వాత గుండె బరువెక్కింది. కన్నీళ్లు వచ్చాయి. గొప్ప మనసు వున్న వాళ్ళు మళ్ళీ పుడతారు, వాళ్ళు ఏం అనుకున్నారో ఇంకో మార్గంలో సాధించుకుంటారని చెప్పా. ఈ రోజు సరళ అన్నయ్య మోహన్ రావు ఇక్కడి వచ్చి సినిమా విజయాన్ని మాతో పంచుకోవడం ఆనందంగా వుంది”అని చెప్పారు. దర్శకుడు వేణు ఉడుగుల మాట్లాడుతూ.. “ఈ చిత్రానికి అన్ని ప్రాంతాలు, వర్గాల ప్రేక్షకుల నుండి యునానిమస్‌గా బిగ్ హిట్ టాక్ వచ్చింది. ఈ ప్రాజెక్ట్ విజయవంతం కావడానికి కారణమైన నిర్మాతలు రానా, సుధాకర్ చెరుకూరి, శ్రీకాంత్, ఒక గాడ్ ఫాదర్‌గా మా అందరినీ వెనుకుండి నడిపించిన సురేష్ బాబులకు కృతజ్ఞతలు. సాయి పల్లవి లేకపోతే ఈ కథ వుండేది కాదు. ఆమెకు ప్రత్యేక కృతజ్ఞతలు”అని చెప్పారు.

Virata Parvam Movie Success Meet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News