Wednesday, January 22, 2025

అద్భుతమైన ప్రేమ కథా చిత్రం

- Advertisement -
- Advertisement -

పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న చిత్రం ‘విరాటపర్వం’. డి. సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా ఈనెల 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రానుంది. ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కర్నూల్ లో జరిగింది. మూడు నిమిషాల నిడివి గల ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ట్రైలర్ లో యాక్షన్, డ్రామా, డైలాగ్స్, ఎమోషన్స్, విజువల్స్ పవర్ ఫుల్‌గా వున్నాయి. నక్సల్ మూమెంట్ నేపధ్యంలో ఓ అద్భుతమైన ప్రేమ కథని తెరపై ఆవిష్కారించబోతున్నారని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. ఈ కార్యక్రమంలో హీరో రానా మాట్లాడుతూ “దర్శకుడు వేణు ఊడుగుల తన జీవిత కాలంలో చూసిన సంఘటనలతో ’విరాటపర్వం’ అనే అద్భుతమైన సినిమా చేశారు.

”చిన్న ఎవడు.. పెద్ద ఎవడు.. రాజ్యమేలే రాజు ఎవడు.. సామ్యవాద పాలననే స్థాపించగా ఎన్నినాళ్లు..” ఇలా నేను ఈ చిత్రంలో గొప్ప కవిత్వం చెప్పుకుంటూ వెళ్తే.. సాయి పల్లవి… అద్భుతమైన వెన్నెల పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమాలో హీరో సాయి పల్లవి. ఇది వెన్నెల కథ”అని అన్నారు. హీరోయిన్ సాయిపల్లవి మాట్లాడుతూ “విరాటపర్వం లాంటి సినిమా చేయడం చాలా గర్వంగా వుంది. అన్ని బలమైన పాత్రలతో ఒక ప్రాంతానికి సంబధించిన బలమైన కథ చెప్పాలంటే బలమైన రచయిత కావాలి. అలాంటి బలమైన రచయిత వేణు ఊడుగుల రూపంలో వచ్చారు. తెలంగాణ భాష, ఊరు గురించి అద్భుతంగా చూపించారు”అని చెప్పారు. దర్శకుడు వేణు ఊడుగుల మాట్లాడుతూ 1990లలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తీసిన చిత్రం అద్భుతమైన ప్రేమకథా చిత్రం విరాటపర్వం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత సుధాకర్ చెరుకూరి, నవీన్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.

Virata Parvam Movie Trailer Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News