Sunday, December 22, 2024

‘విరాటపర్వం’ వచ్చేది అప్పుడే

- Advertisement -
- Advertisement -

Virataparvam release on july 01

 

రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న వైవిధ్యమైన చిత్రం ‘విరాటపర్వం’. డి. సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా విడుదల తేదిని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమా జూలై 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఆసక్తికరంగా వుంది. అడవిలో రానా గన్ గురి పెట్టుకొని దూకుడుగా నడుస్తుండగా సాయి పల్లవి రానా చేయి పట్టుకొని పరుగు తీయడం ఒక వార్ మూమెంట్‌ని తలపిస్తుంది. 1990లలో జరిగిన యదార్థ సంఘటనల నుండి ప్రేరణ పొంది తెరకెక్కించిన ఈ చిత్రంలో రానా కామ్రేడ్ రవన్న పాత్రను పోషించారు. సాయి పల్లవి వెన్నెల పాత్రలో కనిపించనుంది. యుద్ధం నేపథ్యంలో సాగే ఓ అద్భుతమైన ప్రేమకథగా ‘విరాట పర్వం’ ఉండబోతుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News