హైదరాబాద్: ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ ఆటపై వీరేంద్ర సెహ్వాగ్ స్పందించారు. రోహిత్ శర్మ మానసిక స్థితితో ఇబ్బంది పడుతున్నారని, బ్యాటింగ్‌లో సాంకేతిక సమస్య రాలేదని చెప్పాడు. అతడు బ్యాటింగ్ చేస్తుండగా గందరగోళంగా ఉంటున్నాడని చెప్పాడు. రోహిత్ బౌలర్లను ఎదుర్కోవడంలేదని తనకు తానే ఎదుర్కుంటున్నాడని వివరణ ఇచ్చాడు. ఐపిఎల్ 2023లో పది మ్యాచ్‌లో 184 పరుగుల చేసి బ్యాటింగ్‌లో రోహిత్ ఘోరంగా విఫలమయ్యాడు. పది ఇన్నింగ్స్‌లలో ఒక హాఫ్ సెంచరీ మాత్రమే ఉంది. ఐపిఎల్‌లో చరిత్రలో గొప్ప కెప్టెన్‌గా రోహిత్ వెలుగువెలిగాడు. ముంబయికి 2013, 2015, 2017, 2019,2020లో ఐపిఎల్ ట్రోఫీలు అందించాడు. ఐపిఎల్‌లో 16 డకౌట్లతో రికార్డును రోహిత్ తనఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటికే టీమిండియాలో టి-20లో హార్ధిక్ పాండ్యాకు కెప్టెన్‌గా నియమించారు. ఇలానే బ్యాటింగ్ చేస్తే టీమిండియా టి20లోకి రోహిత్ శర్మ రావడం కష్టమే.
Also Read: సన్‌రైజర్స్‌కు ప్లేఆఫ్ కష్టమేనా..!