Tuesday, December 17, 2024

బజ్‌బాల్ బద్దలైంది: సెహ్వాగ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారత్‌లో పర్యటిస్తున్న ఇంగ్లాండ్ జట్టు ఘోర ఓటమితో సిరీస్‌ను కోల్పోయింది. 4-1 తేడాతో సిరీస్‌ను భారత్ చేతిలో పెట్టడంతో ఇంగ్లాండ్ జట్టును ఆ దేశపు, భారత మాజీ ఆటగాళ్లు తీవ్ర విమర్శలు చేశారు. బజ్‌బాల్ అని వీర్రవీగిన జట్టుకు తగిన శాస్తి జరిగిందని టీమిండియా సీనియర్లు ఇంగ్లాండ్ జట్టుకు చురకలంటించారు. టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఇంగ్లాండ్ జట్టును విమర్శించాడు. టీమిండియా దెబ్బకు బజ్‌బాల్ పగిలిపోయిందని, ఇంకా ఇంగ్లాండ్ జట్టు యాజమాన్యం బజ్‌బాల్ బ్రమలోనే ఉందని, ఆ విధానంతో విజయవంతం కావాలంటే ఒక పద్ధతి, ప్రణాళిక ఉండాలని తెలిపారు. వారు ఆలా ఆడటం సరైందని కాదని సూచించారు. ఇంగ్లాండ్ జట్టు స్థాయికి ఈ సిరీస్‌లో ఆడలేదని చురకలంటించారు. రెండో టెస్టు ఓటమి తరువాత ఇంగ్లాండ్ జట్టు పూర్తిగా తేలిపోయిందని, కెప్టెన్ బెన్‌స్టోక్స్ విఫలం కావడంతో ఇంగ్లాండ్ జట్టు సిరీస్‌ను కోల్పోయిందని సెహ్వాగ్ విమర్శలు గుప్పించారు. క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. పాకిస్తాన్ లో పుట్టిన బజ్ బాల్ భారత్ లో చచ్చిపోయిందని నెటిజన్లు జోకులు వేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News