Sunday, December 22, 2024

పంజాబ్ కొత్త డిజిపిగా వీరేష్ కుమార్ భావ్రా

- Advertisement -
- Advertisement -

Viresh Kumar Bhawra is the new DGP of Punjab

చండీగఢ్: పంజాబ్ నూతన పోలీసు డైరెక్టర్ జనరల్‌గా సీనియర్ ఐపిఎస్ అధికారి వీరేష్ కుమార్ భావ్రా శనివారం నియమితులయ్యారు. పంజాబ్‌తోసహా ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడడానికి కొద్ది గంటల ముందు ఈ నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడ్డాయి. పంజాబ్ హోం గార్డు డిజిసిగా పనిచేసిన భావ్రా ప్రస్తుత డిజిపి సిద్ధార్థ్ ఛటోపాధ్యాయ స్థానంలో నియమితులయ్యారు. యుపిఎస్‌సి ఎంపిక చేసిన ముగ్గురు అధికారుల పేర్లతో కూడిన జాబితా నుంచి 1987 బ్యాచ్‌కు చెందిన ఐపిఎస్ అధికారి భావ్రాను చరణ్‌జిత్ సింగ్ చన్నీ ప్రభుత్వం డిజిపిగా ఎంపిక చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News