Monday, November 18, 2024

రికార్డుల మోత మోగించిన విరాట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రన్ మిషన్ విరాట్ కోహ్లీ రికార్డుల మోత మోగిస్తున్నాడు. వరల్డ్ కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌పై విరాట్ కోహ్లీ సెంచరీ చేయడంతో భారత జట్టు భారీ విజయం సాధించింది. వన్డేలో విరాట్ కోహ్లీ 48వ సెంచరీతో రెండో స్థానంలో ఉన్న క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. సచిన్ (49) శతకాలు బాది తొలి స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ 567 ఇన్నింగ్స్‌లలో 26000 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. సచిన్ 601 ఇన్నింగ్స్‌లలో 26 వేల పరుగులు చేశాడు. వరల్డ్ కప్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్ దిగి వెయ్యి పరుగులు పూర్తి చేసిన భారత క్రికెటర్‌గా విరాట్ రికార్డు కైవసం చేసుకున్నాడు.

అంతర్జాతీయ క్రికెట్ లో విరాట్(26026) కంటే ముందు సచిన్(34,357), సంగక్కర(28,016), పాంటింగ్(27,483) బ్యాట్స్‌మెన్లు ఉన్నారు. విరాట్ నాలుగో స్థానంలో ఉన్నాడు. వరల్డ్ కప్ 2023లో లో కోహ్లీ 259 పరుగులతో రెండో స్థానంలో ఉండగా రోహిత్ శర్మ 265 పరుగులతో తొలి స్థానంలో ఉన్నాడు. అన్నీ ఫార్మట్లలో విరాట్ కోహ్లీ 78 సెంచరీలతో రెండో స్థానంలో ఉండగా తొలి స్థానంలో సచిన్(100), మూడో స్థానంలో రికీ పాంటింగ్(71) ఉన్నారు. వరల్డ్ కప్ లో ఒకే జట్టు విరాట్ రెండు సెంచరీలు సాధించి రికార్డు సృష్టించాడు. వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ పై రోహిత్, కోహ్లీ, కెన్యాపై గంగూలీ, సచిన్ రెండేసి సెంచరీలు చేసి రికార్డుల మోత మోగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News