Sunday, November 17, 2024

‘డిఎన్‌ఎ@150’పై వర్చువల్ సదస్సు

- Advertisement -
- Advertisement -

BC gurukul college application deadline on may 31

మనతెలంగాణ, హైదరాబాద్: తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ, జర్మనీ సంస్థ ఎఫ్‌ఎబిఎ అకాడమీ భాగస్వామ్యంతో ‘డిఎన్‌ఎ@150’ పేరిట అంతర్జాతీయ సదస్సు (వర్చువల్)ను విజయవంతంగా నిర్వహించింది. శనివారం నిర్వహించిన ఈ సదస్సులో ప్రముఖ శాస్త్రవేత్తలు ప్రసంగించారు. సిసిఎంబి మాజీ డైరెక్టర్, ప్రొఫెసర్లు డా. రాకేష్ మిశ్రా, అనిల్ కె చల్లా, యూనివర్శిటీ ఆఫ్ అలబామా, యుఎస్‌ఎ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 500 మంది పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. డిఎన్‌ఎ పరిశోధనలో తాజా పోకడలపై పరిశోధన చేస్తున్న విద్యార్థులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. టిఎస్‌సిహెచ్‌ఇ చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి నిర్వాహకులను అభినందించారు.ఉన్నత విద్యాసంస్థలు ఇలాంటి కార్యకలాపాలను మరింత తరచుగా నిర్వహించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News