Saturday, November 23, 2024

యూనివర్సల్ సబ్జెక్ట్ ‘విరూపాక్ష’

- Advertisement -
- Advertisement -

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మిస్టీక్ థ్రిల్లర్ విరూపాక్ష. సంయుక్తమీనన్ కథానాయిక. కార్తీక్ దండు దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై బాపినీడు.బి సమర్పణలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఏప్రిల్ 21న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. ఈ మూవీ నుంచి పాత్రలను పరిచయం చేస్తూ హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ “డైరెక్టర్ కార్తీక్ ఈ సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు.

శ్యాం కెమెరా పనితనానికి హ్యాట్సాఫ్. నాగేంద్ర ఆర్ట్ వర్క్ అద్భుతంగా ఉంది. విరూపాక్ష ప్రపంచాన్ని అద్భుతంగా రూపొందించారు. కార్తీక్ విజన్‌కు అజనీష్ ప్రాణం పోశారు. బీజీఎం అదరగొట్టేశారు. పాటలు బాగా వచ్చాయి. సినిమా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను”అని అన్నారు. దర్శకుడు కార్తిక్ దండు మాట్లాడుతూ “ఈ సినిమా కథను 2018లో రాశాను. కరోనా వల్ల సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. కానీ కరోనా గ్యాప్‌లో కథను ఎక్కడా మార్చలేదు.

ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ అదరగొట్టేశారు”అని చెప్పారు. నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ “నేను ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు చేశాను. ఎప్పుడూ కథను నమ్మే సినిమాలు చేశాను. ఇది యూనివర్సల్ సబ్జెక్ట్. అందుకే పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ చేస్తున్నాము”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంయుక్త మీనన్, సాయిచంద్, సునీల్, బ్రహ్మాజీ, శ్యామల, అభినవ్, అజయ్, శ్యాందత్, నాగేంద్ర పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News