Thursday, December 26, 2024

మిథికల్ థ్రిల్లర్..

- Advertisement -
- Advertisement -

ప్రతిష్టాత్మక, భారీ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (ఎస్‌విసిసి) సంస్థ మరో భారీ ప్రాజెక్ట్‌ను, ఆసక్తికరమైన చిత్రాన్ని నిర్మిస్తున్నట్లుగా ప్రకటించింది. ఈ చిత్రాన్ని మరో ప్రముఖ నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్ అసోసియేషన్‌తో నిర్మాణం చేస్తుంది ఎస్‌విసిసి సంస్థ. ఈ సంస్థలు సంయుక్తంగా గత ఏడాది సాయి దుర్గా తేజ్, సంయుక్త మీనన్‌లతో కార్తీక్ దండు దర్శకత్వంలో బ్లాక్‌బస్టర్ మిస్టికల్ థ్రిల్లర్ ’విరూపాక్ష’ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.

ఇప్పుడు ’విరూపాక్ష’ చిత్రంతో దర్శకుడిగా తన ప్రతిభను చాటి చెప్పిన కార్తీక్ దండు దర్శకత్వంలోనే ఈ తాజా చిత్రాన్ని భారీ చిత్రాల మేకర్ ప్రముఖ బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి బ్రిలియంట్ దర్శకుడు సుకుమార్ కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్‌గా ఉండటం ఈ సినిమాకు మరో ఆకర్షణ. కాగా ఈ చిత్రంలో వైవిధ్యమైన చిత్రాల కథానాయకుడిగా పేరున్న యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్నారు. శనివారం ఆయన పుట్టినరోజు సందర్భంగా, ఆసక్తికరమైన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ఒక అద్భుతమైన కన్ను ప్రతీకతో పాటు, రాక్ క్లైంబింగ్ టూల్స్‌తో ఓ పర్వతంపై నిలబడి ఉన్న నాగ చైతన్య కనిపించారు. ఇది ప్రేక్షకులలో భారీ ఆసక్తిని రేకెత్తించింది. ‘ఎన్‌సి24‘ అనే వర్కింగ్ టైటిల్‌తో, ఈ చిత్రం డిసెంబరులో షూటింగ్ ప్రారంభించుకోనుంది. భారీ బడ్జెట్‌తో, అత్యున్నత ప్రొడక్షన్ విలువలతో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News