Thursday, January 23, 2025

రూ.100 కోట్ల క్లబ్ దిశగా ‘విరూపాక్ష’

- Advertisement -
- Advertisement -
ఇప్పటికే 8 రోజుల్లో రూ. 65 కోట్ల గ్రాస్ వసూలు 

హైదరాబాద్:  సాయితేజ్ హీరోగా రూపొందిన ‘విరూపాక్ష’ ఏప్రిల్ 21వ తేదీన థియేటర్లలో విడుదలయింది. బివిఎస్ ఎన్. ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి సుకుమార్ కూడా ఒక నిర్మాత. ఆయన స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాకి, కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించారు. సంయుక్త మీనన్ కథానాయికగా నటించింది. విడుదల రోజునే ఈ సినిమా అన్ని ప్రాంతాలలోను సక్సెస్ టాక్ ను తెచ్చుకుంది. తొలి రోజునే రూ.12 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా, నాలుగు రోజుల్లోనే రూ. 50 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఇక నిన్నటితో ఈ సినిమా 8 రోజులను పూర్తిచేసుకుంది. ఈ 8 రోజుల్లో ఈ సినిమా రూ. 65 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. త్వరలోనే ‘విరూపాక్ష’ 100 కోట్ల క్లబ్ లోకి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఇదో హారర్ సినిమా. సినిమా కథ ఎవరూ ఊహించని విధంగా సాగిపోతుంటుంది.  అజనీశ్ లోక్ నాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమా సక్సెస్ లో ప్రధానమైన పాత్రను పోషించింది. నటీనటులందరూ తమ పాత్రల్లో లీనమై నటించారు. ఈ సిినిమా ఇంటిల్లిపాదికి నచ్చక పోవచ్చు. కానీ హారర్ సినిమాలు ఇష్టపడేవారు చూడొచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News