Monday, December 23, 2024

‘విరూపాక్ష’ సక్సెస్ ప్రేక్షకులది

- Advertisement -
- Advertisement -

సాయిధరమ్ తేజ్ హీరోగా సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా నటించిన మిస్టికల్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’. కార్తీక్ దండు దర్శకత్వంలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై బాపినీడు బి. సమర్పణలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే అందించిన ఈ చిత్రం తాజాగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఈ సందర్భంగా హైదారాబాద్‌లో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌లో గోపీచంద్ మలినేని మాట్లాడుతూ… ఈ సినిమాకు ఇద్దరు హీరోలు. హీరో సాయిధరమ్ తేజ్, డైరెక్టర్ కార్తీక్ దండు రియల్ హీరోలు.

ఎందుకంటే దెబ్బ తిన్నా కూడా లేచి నిలబడి సక్సెస్ కొట్టారు. గొప్ప థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌నిచ్చే సినిమా ఇది అని తెలిపారు. హీరో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ… ‘విరూపాక్ష’ సినిమా సక్సెస్ నాదో, మా టీమ్‌దో కాదు. మన ఆడియన్స్‌ది. ఈ సినిమా మన ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ సక్సెస్’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో బివిఎస్‌ఎన్ ప్రసాద్, మారుతి, కార్తీక్ దండు, సంయుక్తా మీనన్, అజనీష్ లోక్నాథ్, శ్యామ్‌దత్, సోనియా సింగ్, అజయ్, బ్రహ్మాజీ, రవి కృష్ణ, కమల్ కామరాజు, సాయిచంద్ తదితరులు పాల్గోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News