ఎయిమ్స్ ఫోరెన్సిక్ చీఫ్ వెల్లడి
న్యూఢిల్లీ: కరోనాభయంతో సొంత కుటుంబ సభ్యుడే చనిపోయినా అంత్యక్రియలు నిర్వహించడానికి ఎవరూ ముందుకు రాని ఘటనలు ఎన్నో చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఎయిమ్స్‌కు చెందిన ఫోరెన్సిక్ చీఫ్ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. కరోనా వైరస్ సోకిన వ్యక్తి మరణించిన1224 గంటల తర్వాత ఆ వ్యక్తి ముక్కు, శ్వాసకుహరంలో వైరస్ యాక్టివ్‌గా ఉండదని, అందువల్ల మృతి చెందిన వ్యక్తినుంచి వైరస్ ఇతరులకు వ్యాపిచే అవకాశాలు లేవని ఢిల్లీలోని అఖిల భారత వైద్య పరిశోధనా సంస్థ ( ఎయిమ్స్) ఫోరెన్సిక్ విభాగం చీఫ్ డాక్టర్ సుధీర్ గుప్తా స్పష్టం చేశారు.. ‘పోస్టుమార్టం అవసరమైన కొవిడ్19 సోకి మరణించిన వారికి సంబంధించిన మెడికో లీగల్ కేసులపై గత ఏడాది కాలంగా పైలట్ స్టడీ నిర్వహించారు. మరణించిన 12నుంచి 24 గంటల విరామం తర్వాత దాదాపు 100 మృత దేహాలకు కరోనా వైరస్ ఇన్‌ఫెక్షన్‌కు సంబంధించి మళ్లీ పోస్టుమార్టమ్ నిర్వహించగా, ఫలితం నెగెటివ్ వచ్చింది.
మరణించిన 24 గంటల తర్వాత వైరస్ ముక్కు, శ్వాస కుహరంలో ఎంతమాత్రం యాక్టివ్‌గా ఉండదు’ అని డాక్టర్ గుహ పిటిఐ వార్తాసంస్థతో మాట్లాడుతూ చెప్పారు.. వైరస్ సోకిన వ్యక్తి మరణించిన 1224 గంటల తర్వాత అతనినుంచి వైరస్ ఇతరులకు సోకే అవకాశం ఎంతమాత్రం లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే ముందు జాగ్రత్త కోసం చనిపోయిన వ్యక్తి శరీరంలోని ఫ్లూయిడ్స్,ఇతర కక్షలు, పొట్టలోకి ద్రవాలను పంపడానికి వాడే ట్యూబులు వంటివి తొలగించడం వల్ల ఏర్పడిన రంధ్రాలనుంచి లీకేజ్ కాకుండా ఉండడానికి ముక్కు, శ్వాస కుహరాలను మూసి ఉంచాలని, ఆ పైపులను శానిటైజ్ చేయాలని ఆయన అన్నారు. అంతేకాకుండా ముందు జాగ్రత్త చర్యగా అలాంటి మృత దేహాలను మోయడం లాంటివి చేసే వారు మాస్కులు, గ్లోవ్స్, పిపిఇ కిట్లు లాంటి రక్షణ పరికరాలను ఉపయోగించాలని కూడా ఆయన తెలిపారు. అంతేకాదు, మృత దేహంనుంచి వైరస్ ఇతరులకు వ్యాపించే అవకాశం ఎంతమాత్రం లేనందున అస్థికలు, చితాభస్మం లాంటివి సేకరించడం పూర్తిగా సురక్షితమని గుప్తా తెలిపారు. మృతి చెందిన వారి గౌరవాన్ని కాపాడే ఉద్దేశంతో ఈ అధ్యయనాన్ని నిర్వహించినట్లు కూడా ఆయన సష్టం చేశారు.