Sunday, February 9, 2025

పొరుగు రాష్ట్రాల చికెన్‌కు చెక్

- Advertisement -
- Advertisement -

వైరస్‌తో మృత్యువాత పడుతున్న
లక్షలాది బ్రాయిలర్ కోళ్లు
యుద్ధ్దప్రాతిపదికన నివారణ
చర్యలు చేపట్టిన సర్కార్
రాష్ట్ర సరిహద్దుల్లో 24 చెక్‌పోస్టులు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొన్ని జిల్లాలలోని పౌల్ట్రీ ఫారాల్లో వైరస్ కారణంగా ఊ హించని రీతిలో లక్షలాది బ్రాయిలర్ కోళ్లు మరణిస్తున్నాయి. ప్రాధమికంగా మిక్స్‌డ్ వైరస్ ఆర్డీ (కొక్కెర రోగం) ప్రభావంతో కోళ్లు మృత్యువాత పడుతున్నట్లుగా అధికారులు నిర్ధారణకు వచ్చారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి దిగుమతి అయ్యే దాణా, పౌల్ట్రీ కోళ్ల దిగుమతిని నిరోధించాలని పోలీసు శాఖను, వలస పక్షుల కదలికలను పర్యవేక్షించాలని అటవీ శాఖలకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

సరిహద్దు జిల్లాల్లో ఉదృతంగా వ్యాప్తి చెందుతు న్న ఈ వైరస్‌ను నివారించడం, బ్రాయిలర్ ఫారాల రైతులను చైతన్యవంతం చేసే చర్యల్లో రాష్ట్ర సర్కా రు నిమగ్నమైంది. శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యే క ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్, పశుసంవర్ధక శాఖ కమిషనర్ డాక్టర్ గోపి సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించా రు. జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులు, వైరస్ తీవ్రత, పౌల్ట్రీ ఫారాల్లో మృత్యువాత పడుతున్న కోళ్ల గ ణాంకాలను పర్యవేక్షించారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉ న్నట్లు గుర్తించారు. సరిహద్దుల్లో పౌల్ట్రీ ఫారాల నుంచి కోళ్లు రవాణాను పరిశీలించేందుకు 24 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.

అంతే కాకుండా సమ స్య తీవ్రతతో ఆకస్మిక పరిస్థితులు ఎదురైతే అనతికాలంలోనే ఎదుర్కొనేందుకు వీలుగా ఆయా సరిహద్దు జిల్లాల్లో పశుసంవర్ధక శాఖ సుమారు 1, 300 రాపిడ్ రెస్పాడింగ్ టీమ్స్ ఏర్పాటు చేసింది. ప్రస్తుత పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని నిర్ణయించారు. అవసరమైతే మాసబ్ ట్యాంక్ వద్దగల పశుసంవర్ధక శాఖ డైరెక్టరేట్ కార్యాలయం లో ప్రత్యేక కంట్రోల్ రూంను ప్రారంభించి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని నిర్ణయించారు. మరణించిన కొన్ని పౌల్ట్రీ కోళ్లు, పక్షుల న మూనాలను సేకరించి వాటిమరణానికి గల ఖచ్చితమైనకారణాలను గుర్తించేందుకు ల్యాబ్‌లకు పం పించారు. వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ప్రోటో కాల్ ప్రకారంగా అన్నిరకాల బయో సెక్యూరిటీ చర్యలు చేపట్టాలని అన్ని జిల్లాల కలెక్టర్లు పరిస్థితి ని నిశితంగా పరిశీలించాలని ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్, ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News