Tuesday, October 29, 2024

త్వరలో వీసా లేకుండా రష్యా పర్యటన

- Advertisement -
- Advertisement -

వీసా లేకుండా భారతీయులు రష్యా పర్యటించే అవకాశం త్వరలో అందుబాటు లోకి రానుంది. ఈమేరకు కొంతకాలంగా చర్చలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన ఒప్పందాలు కీలక దశలో ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో 2025 స్ప్రింగ్ సీజన్ నుంచి వీసాఫ్రీ సదుపాయం అందుబాటు లోకి వచ్చే అవకాశం ఉన్నట్టు రష్యాకు చెందిన ఉన్నతాధికారి ధ్రువీకరించారు. దీనివల్ల భారత్ నుంచి పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరగనున్నట్టు అంచనా వేస్తున్నామని మాస్కో సిటీ టూరిజం కమిటీ ఛైర్మన్ ఎవ్జెనీ కోజ్లోవ్ తాజాగా వెల్లడించారు. “ టూరిజం విషయంలో రష్యాకు భారత్ ఇప్పటికే కీలక మార్కెట్‌గా అవతరించింది.

ఈ ఏడాది తొలి ఆరు నెలల్లోనే 28,500 మంది భారతీయులు మాస్కోలో పర్యటించారు. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఈ సంఖ్య ఒకటిన్నర రెట్లు పెరిగింది. వాణిజ్యం, వ్యాపార సంబంధిత కారణాలతో రష్యాలో పర్యటించడం ఎక్కువగా ఉంటోంది. ముఖ్యంగా సుదీర్ఘ సంబంధాల దృష్టా భారత్‌ను కీలక మార్కెట్‌గా పరిగణిస్తున్నాం ” అని మాస్కో అధికారి పేర్కొన్నారు. గత ఏడాది ఆగస్టు 1 నుంచి భారత్ నుంచి రష్యా వచ్చే ప్రయాణికులు ఈ వీసా దరఖాస్తు చేసుకునే (నాలుగు రోజుల్లో జారీ అవుతుంది) వెసులుబాటు అందుబాటు లోకి వచ్చింది. సంఖ్యాపరంగా గత ఏడాది అత్యధిక వీసాలు పొందిన తొలి ఐదు దేశాల్లో భారత్ నిలిచింది. గత ఏడాది మొత్తం 9500 భారత పర్యాటకులకు ఈ వీసాలు జారీ అయ్యాయి. రష్యాకు వచ్చే విదేశీ పర్యాటకుల్లో ఇది ఆరు శాతమని మాస్కో అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News