Tuesday, November 26, 2024

క్రిప్టోకరెన్సీలో చెల్లింపులకు అనుమతించిన ‘వీసా’

- Advertisement -
- Advertisement -

Visa
న్యూఢిల్లీ: క్రిప్టోకరెనీలకు రోజురోజుకు పెరుగుతున్న డిమాండ్ దృష్టా క్రిప్టోకరెన్సీలో చెల్లింపులకు ‘వీసా’ సంస్థ అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. ఇథీరియం టెక్నాలజీ ఆధారంగా ఈ చెల్లింపులు ఉంటాయి. ఇథీరియం నెట్‌వర్క్ ద్వారా డిజిటల్ కరెనీ యూఎస్‌డి కాయిన్‌లో చెల్లింపులు జరిపేందుకు అనుమతిస్తున్నట్లు వీసా తాజాగా ప్రకటించింది. యూఎస్‌డి కాయిన్(యూఎస్‌డిసి) అనేది స్టేబుల్ కాయిన్ క్రిప్టోకరెన్సీ. దాని విలువ నేరుగా యూఎస్ డాలర్‌లోకి మారుతుంది.
వీసా కన్నా ముందే ఇతర డిజిటల్ సంస్థలైన బిఎన్‌వై మెల్లన్, బ్లాక్‌రాక్, మాస్టర్ కార్డ్ వంటివి డిజిటల్ కరెన్సీ చెల్లింపులకు అనుమతించాయి. దీంతో పెట్టుబడులకు క్రిప్టోకరెన్సీలు కూడా ప్రధాన భాగం కానున్నాయనే అంచనాలు ఊపందుకున్నాయి. టెస్లా ఇన్‌కార్పొరేషన్ బాస్ ఎలాన్ మస్క్ గత వారం వినియోగదారులు తమ ఎలెక్ట్రిక్ వాహనాలను బిట్‌కాయిన్ చెల్లించి కూడా కొనవచ్చని ప్రకటించడం ఇక్కడ గమనార్హం. ఇంతవరకు వీసా ద్వారా క్రిప్టోకరెన్సీల్లో చెల్లింపులు చేయాలనుకున్నప్పుడు వాటిని ముందుగా సాధారణ నగదులోకి మార్చాల్సిన అవసరం ఉండేది. అయితే ఇప్పుడు ఇథీరియం బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ఆధారంగా చెల్లింపులు చేసేందుకు వీసా అనుమతించడంతో ఈ నగదుకు మార్చాల్సిన అవసరం తప్పింది. గమనించాల్సిన విషయం ఏమిటంటే డిజిటల్ అసెట్ బ్యాంక్ యాంకరేజ్‌తో వీసా భాగస్వామ్యం అయింది. ఈ నెలలో క్రిప్టో డాట్ కామ్ ద్వారా యాంకరేజ్ వద్ద ఉన్న వీసా ఇథీరియం అడ్రస్‌కు తొలి ట్రానాక్షన్ జరిగింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News